ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఉన్నత చదువులు చదువుకొని , ఉన్నత స్థానంలో నిలిచి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలి -మాజీ మంత్రి...

ఉన్నత చదువులు చదువుకొని , ఉన్నత స్థానంలో నిలిచి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలి -మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన రామకృష్ణను అభినందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి : ఉన్నత చదువులు చదువుకొని, ఉన్నత లక్ష్యాలను (ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్) నిర్దేశించుకుని, కష్టపడి చదివితే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా, చండూరు మండలం, ధోనిపాముల గ్రామానికి చెందిన గాజనబోయిన ముత్తయ్య హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. సీనియర్ పాత్రికేయులుగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు గాజనబోయిన రామకృష్ణ బాలాపూర్ చౌరస్తాలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 960 మార్కులు సాధించి మెరుగైన ఫలితాలు సాధించాడు. ఈ సందర్భంగా రామకృష్ణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రామకృష్ణను అభినందించి సన్మానం చేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి ఉన్నత.. కృషి, పట్టుదలతో మెరుగైన మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. అధిక మార్కులు సాధించేలా కృషి చేసిన తల్లిదండ్రులు గాజన బోయిన ముత్తయ్య , రాజేశ్వరిని, వాగ్దేవి కాలేజీ విద్యా సంస్థల సిబ్బంది, యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉచిత విద్య వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కువ సమయం సెల్ ఫోన్ల కు సమయం కేటాయించవద్దన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ, తల్లిదండ్రులకు విలువిస్తూ, పెద్దలను గౌరవిస్తూ ఉన్నత చదువులు శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచిసూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి, సోషల్ మీడియా వారియర్ సిల్వేర్ సాంబశివ, అర్కల భూపాల్ రెడ్డి, ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, రెడ్డిగళ్ళ సుమన్, పెద బీరప్ప, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ సైనికుడు వాసు బాబు, లార్డ్ స్కూల్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!