ప్రతిఘటన జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్
అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయుడు అంబేద్కర్ అని ధ్యాగదొడ్డి మాజీ ఉపసర్పంచ్ గడ్డం గోపాల్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంగళవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన భీమ్రావు, చిన్నప్పటి నుంచే కుల వివక్షను అత్యంత దారుణంగా ఎదుర్కొన్నారన్నారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో సమానంగా కూర్చునే అవకాశం లేకపోయినా, చదువు ద్వారానే తన జీవితాన్ని, సమాజాన్ని మార్చగలనని ఆయన బలంగా నమ్మారన్నారు. ఆ పట్టుదలే ఆయనను ఉన్నత విద్య వైపు నడిపించింద గుర్తు చేశారు. అంబేద్కర్ బోధనలను, ఆశయాలను, విలువలను భావితరాలకు అంటరానితనం, కుల వివక్ష లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి నిరుపమానమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, నరేష్, ఆనంద్, లక్ష్మణ్, నవీన్ యాదవ్, సప్పట్ రాములు, సోలాగోపాల్, పాలెం కృష్ణ, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
