ePaper
Saturday, June 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజోగులాంబ గద్వాలనెట్టెంపాడు లో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు -ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి...

నెట్టెంపాడు లో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు -ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వెంకట్రామిరెడ్డి 

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్ 

భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ధరూర్ మండల్ మాజీ వైస్ ఎంపీపీ, పాగుంట ఆలయ కమిటీ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని జయంతిని పురస్కరించుకొని మంగళవారం నెట్టెంపాడు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొని.. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రూపొందించిన భారత రాజ్యాంగ సలాలు అట్టడుగు వర్గాలకు ఉండాలంటే ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంతకుముందు గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరి మబ్బన్న, ఉప సర్పంచ్ మ్మ మల్లేష్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్లు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!