ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణపేదలను వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

పేదలను వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

📰 Generate e-Paper Clip

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహా

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా రిపోర్టర్ జంగిటి రవీందర్

పేదలపైన, వ్యవసాయ కూలీల పైన అనేక భారాలను మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహా విమర్శించారు. శనివారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరగగా.. ఈ సమావేశంలో నర్సింహా పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలోని గ్రామీణ ప్రాంత పేదలకు, వ్యవసాయ కూలీలకు కీలకంగా ఉపయోగపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసి పేరు మార్చి, బడ్జెట్లో నిధులు కోత విధించి అనేక భారాలు మోపారని విమర్శించారు. అదే బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలను, కూలీలను విస్మరించిందని తెలిపారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం అనే డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కొటేషన్ చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అందుకు భిన్నంగా బడ్జెట్ ను ప్రతిపాదించారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఎలాంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేవని పేర్కొన్నారు. విద్యా, వైద్యం, ఉపాధి లాంటి కీలకమైన రంగాలకు తగిన నిధులు కేటాయించలేదని తెలిపారు. సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున కూత పెట్టారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి 40 శాతం నిధులు కేటాయించలేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగులో ఉన్న ఇండ్లకు, కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్క పైసా కూడా ఈ బడ్జెట్లో చూపలేదని విమర్శించారు. భూమిలేని వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని హామీలు చెప్పిన ఈ ప్రభుత్వం కేవలము రూ. 6 కోట్లు కేటాయిస్తే భూమిలేని కుటుంబాలకు రూ.12 వేలు చొప్పున ఎన్నడు ఇయ్యగలరని ప్రశ్నించారు. కౌలు రైతులను విస్మరించారని, భూ నిర్వాసితులను ఆదుకోవడం, పునరావాసం కల్పించడం, భూమి మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు కూడా ప్యాకేజ్ గురించి కనీసం ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదని అన్నారు. ఈ విధంగా అన్ని వర్గాలను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కూలీలు, పేదలు సంఘటితంగా ఐక్యంగా ఉద్యమించాలని నర్సింహా పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల పెంటయ్య, గంగాదేవి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి, సల్లూరి కుమార్, కూకుట్ల చొక్కాకుమారి, కమిటి సభ్యులు అందెల జ్యోతి, దొడ్డి బిక్షపతి, కొండపురం యాదగిరి, మెతుకు అంజయ్య, బొల్లెపల్లి కిషన్, కొమ్ము అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!