ప్రతిఘటన, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్
బజ్జి బాబా దేవాలయ ప్రాంగణంలో మంగళవారం ద్వాదశి సందర్భంగా ఉదయం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో చుట్టుపక్కల కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎరుపు వస్త్రం పై వరుసగా కూర్చుని పూజా సామగ్రి, పూలు, పసుపు – కుంకుమ, పండ్లతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. కుటుంబ సౌభాగ్యం, సంఘ సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొనగా, పూజ అనంతరం మహిళలకు తీర్థప్రసాదాలు, వాయనం అందజేశారు. నిర్వాహకులు ప్రతి వారం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో హిందూ సమ్మేళనం కార్యదర్శులు కూడా ఉన్నారు.
