ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్రాములు కాక. ఎలా ఉన్నావ్

రాములు కాక. ఎలా ఉన్నావ్

📰 Generate e-Paper Clip

మాజీ సర్పంచ్ కట్టెల రాములు ఎలా ఉన్నావని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ప్రస్తుత జల్ పల్లి డివిజన్, పూర్వ జల్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ కట్టెల రాములు గతంలో 20 సంవత్సరాల పాటు ఆ గ్రామానికి సర్పంచిగా పని చేశారు. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మౌలిక వసతులు కల్పించారు. వయసు పైబడిన రీత్యా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి, ఆయన త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి , మాజీ సర్పంచ్ భద్రమ్మ , జల్పల్లి సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్దన్ , మాజీ ప్రజా ప్రతినిధిలు యాతం పవన్ కుమార్ యాదవ్ , పల్లపు శంకర్ , సీనియర్ నాయకులు కొంగరి సుభాష్, నవపేట ఆంజనేయులు, మారుతి, శంకర్ , నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!