ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమహబూబ్ నగర్రామాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం

రామాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం

📰 Generate e-Paper Clip

ప్రతి ఘటన, నాగర్ కర్నూలు బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్

జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈనెల 19న గురువారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని, వివిధ ప్రాంతాలలో గల భక్తులు ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొని శ్రీ పరాభవ నామ సంవత్సర వివిధ రాశుల ఫలితాలు, వర్షాలు, పంటలు, ప్రకృతి, వివిధ జన్మ నక్షత్రాలు జన్మరాశుల వారికి ఆదాయ, వ్యవయాలు, రాశి ఫలితాలు తెలపనున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం రామాలయ అన్న ప్రసాద కమిటీ వారిచే భక్తులందరికీ ఉగాది పచ్చడి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు మహిళలు ఉగాది పంచాంగ శ్రవణంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440981253 లో సంప్రదించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!