ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్గుంతల రోడ్డుతో ప్రయాణం నరకం

గుంతల రోడ్డుతో ప్రయాణం నరకం

📰 Generate e-Paper Clip

ప్రమాదాల బారిన పడుతున్న ద్విచక్ర వాహనదారులు

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

జల్పల్లి సర్కిల్ షాహిన్ నగర్ 63వ డివిజన్ కొత్తపేట ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు గుంతల మయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొత్తపేట కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కొత్తపేట ప్రధాన రహదారి నుంచి నబిల్ కాలనీ మీదుగా బార్కస్ వెళ్లే రోడ్డు పెద్ద మర్రిచెట్టు సమీపంలో గుంతల మయంగా మారింది. అసలే గుంతల మయంగా ఉందంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు గుంతలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనాలు కూడ వెళ్ళలేని పరిస్థితి అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఎంతో మంది గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంపై బస్తీ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సీసీ రోడ్డు అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

సీసీ రోడ్డు ఏర్పాటు చేసి ప్రమాదాల బారి నుంచి ప్రజలను కాపాడాలి

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హయంలో ఉస్మాన్ నగర్ నుంచి కొత్తపేట వరకు రూ. 2 కోట్ల తో సీసీ రోడ్డు అభివృద్ధి చేశారు. నబిల్ కాలనీ ముంపు సమస్య కోసం రూ.
6.5 కోట్లతో బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు చేయించారు. ముంపు సమస్యను తీర్చారు. ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇప్పటి వరకు కొత్తపేటలో చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేదు. కేవలం లక్షలతో చేసే అభివృద్ధి పనులు కూడా చేయలేదు. కనీసం రోడ్డుపై దృష్టి పెట్టి మరమ్మత్తు పనులు కూడా చేయలేదు. రోడ్డు అస్తవ్యస్థంగా ఉంది. ప్రతి సంవత్సరం వర్షాల ధాటికి రోడ్డు దెబ్బతింటుంది. దీంతో కొన్ని సంవత్సరాల నుండి రహదారులు గుంతల మయంగా మారుతున్నాయి. రోడ్డు పై వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జల్పల్లి అధికారులకు ఇప్పటి వరకు 3 సార్లు వినతి పత్రం సమర్పించాను. అయినా స్పందన లేదు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి.

జల్పల్లి సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ గాలిబ్

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!