ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్అవార్డు గ్రహీత కర్క నాగరాజుని అభినందించిన బండిరమేశ్

అవార్డు గ్రహీత కర్క నాగరాజుని అభినందించిన బండిరమేశ్

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, గోషామహల్ రిపోర్టర్ సంకర్షణ

కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ ప్రాంతానికి చెందిన కూకట్ పల్లి నియోజకవర్గం ఐ.ఎన్.టీ.యు.సీ, పీజేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కర్కనాగరాజు అత్యంత ప్రతిష్టాత్మికమైన వరల్డ్ అచివర్స్ అవార్డు – 2026 అందుకున్న సందర్భంగా బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి రమేశ్ మాట్లాడుతూ.. కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ ప్రాంతానికి చెందిన ఐ.ఎన్ టీ.యు.సీ, పీజేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కర్క నాగరాజు కు అత్యంత ప్రతిష్టాత్మికమైన వరల్డ్ అచివర్స్ అవార్డు – 2026 రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కర్క నాగరాజుని అభినందించారు. దేశ రాజధాని న్యూఢిల్లీ జనక్ పూరి హోటల్ హయత్ సెంట్రిక్‌లో జరిగిన కార్యక్రమంలో కర్క నాగరాజు కు అవార్డును భారత మాజీ క్రికెట్ ప్లేయర్ చేతన్ శర్మ చేతుల మీదుగా అందుకొవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ సర్వీస్, ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ కేటగియరీ లో ఎంపికయ్యారని వారు తెలిపారు. సామాజిక కార్యక్రమాలు, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ ముందు ముందు మరిన్ని అవార్డులు అందుకోవాలని నాగరాజుకి సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కర్క పెంటయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, కంటెస్టెడ్ కార్పొరేటర్ రఘు, తూము మనోజ్ కుమార్ , సంజీవరావు, సతీష్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!