కళ్లెం నవజీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించిన సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు హయత్‌నగర్ తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సీనియర్ సభ్యులు పాల్గొని శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నక్క దర్శన్ గౌడ్ మాట్లాడుతూ… వారి తండ్రి స్వర్గీయ కళ్లెం పెంటా రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందారని తెలిపారు. హయత్‌నగర్ డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో విశేషంగా తోడ్పాటు అందించారని అన్నారు. అదేవిధంగా స్వర్గీయ కళ్లెం పెంటా రెడ్డి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని, కేవలం హయత్‌నగర్‌లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆయనకు గొప్ప పేరు, గౌరవం ఉందని పేర్కొన్నారు. అదే సేవా భావాన్ని కొనసాగిస్తూ నవజీవన్ రెడ్డి ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
ఇక రానున్న రోజుల్లో కళ్లెం నవజీవన్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, దానికి హయత్‌నగర్ గ్రామ ప్రజలు ఎల్లవేళలా వారి వెన్నంటే ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి సన్మానించిన సీనియర్ సిటిజన్స్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హయత్‌నగర్ డివిజన్ ప్రజలు ఇచ్చిన ప్రేమ, ఆదరణతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగానని
అన్నారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని, ప్రజల సేవే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే హయత్‌నగర్ గ్రామ ఉనికి కోసం తాను ఎప్పుడూ ముందుంటానని, గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నక్క దర్శన్ గౌడ్, కార్యవర్గ సభ్యులు పర్వత మల్లారెడ్డి , టీ. ఎన్ దాస్, బోడ బిక్షపతి, సహాదేవ్, లక్ష్మయ్య, సుదం కేశవులు, కళ్లెం శంకర్ రెడ్డి, నక్క రవీందర్ గౌడ్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
