ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి సవాల్ విసిరిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి( బంటి )
ప్రతిఘటన, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య
యాచారం మండలం మేడిపల్లి ఫార్మా భూముల విషయంలో మేము అవినీతికి పాల్పడ్డాము అని అంటున్నావు కదా.. మల్ రెడ్డి రంగారెడ్డి 45 రోజుల్లో నీరూపించు.. లేదా బిడ్డా 46వ రోజున నువ్వు అవినీతిగా సంపాదించి నీ చుట్టాలు, తమ్ముళ్లు, బినామీలపై చేసిన భూములను మేము దున్నడం ఖాయమని మీడియా ముఖంగా మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు బీఆర్ఎస్ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి( బంటి ) ఘాటుగా హెచ్చరించారు. యాచారం మండలం మేడిపల్లి ఫార్మా భూముల విషయంలో బీఆర్ఎస్ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి( బంటి )తో పాటు ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి మహేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో మహేశ్వరం బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి( బంటి) ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) మాట్లాడుతూ తాము అవినీతికి పాల్పడ్డామని నిరూపించాలని లేకపోతే నీవు అవినీతిగా సంపాదించి నీ చుట్టాలు, తమ్ముళ్లు, బినామిలపై చేసిన భూములను మేము దున్నడం ఖాయమని ఖాయమన్నారు. మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి( బంటి) ని కలిసిన వారిలో మహేశ్వరం మండలం సర్పంచ్ మునగపాటి నవీన్ , ఉప సర్పంచ్ జోరల రమేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరొళ్ల చంద్రయ్య ముదిరాజ్, పోతర్ల అంబయ్య యాదవ్, మహేశ్వరం పట్టణ అధ్యక్షుడు కటికల మహేందర్ ముదిరాజు, పీఎసీఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, దుడ్డు కృష్ణ యాదవ్, అవులకాడి శ్రీశైలం యాదవ్ తదితరులు.
