ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలు ప్రజా అవసరాల కోసం వినియోగించాలి

ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలు ప్రజా అవసరాల కోసం వినియోగించాలి

📰 Generate e-Paper Clip

భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కానుగుల

ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో :

యాకుత్ పుర సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ మున్సిపల్ స్థలాలను రక్షించి ప్రజా అవసరాల కోసం వినియోగించాలని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కలుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి కి ప్రజాహిత వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కణుకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాకుత్ పుర సర్కిల్ పరిధిలో అనేక మున్సిపల్, ప్రభుత్వ స్థలాలు ప్రజలకు ఎటువంటి ఉపయోగంలో లేకుండా ఉండాయి అన్నారు. ఇట్టి ఖాళీ స్థలాలను అభివృద్ధి చేసి ప్రజా అవసరాల కోసం పబ్లిక్ హెల్త్ సెంటర్లు, లైబ్రరీ, క్రీడా మైదానాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో భాగ్యనగరం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకరి వేణు, కోశాధికారి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!