ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్కాంగ్రెస్ సీనియర్ నేతను పరామర్శించిన కేఎల్ఆర్

కాంగ్రెస్ సీనియర్ నేతను పరామర్శించిన కేఎల్ఆర్

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ సీనియర్ నేతను పరామర్శించిన కేఎల్ఆర్

ప్రతిఘటన, మహేశ్వరం ముత్తయ్య

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ అబ్దుల్లా బిన్ అవాద్ తండ్రి అవాద్ బిన్ అబ్దుల్లా అనారోగ్యంతో మంగళవారం మరణించారు. విషయం ఆలస్యంగా తెలియడంతో బుధవారం
పహాడీషరీఫ్ లోని వారి నివాసానికి వెళ్లి అబ్దుల్లాను కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతినీ తెలిపారు.
ప్రజా ప్రతినిధిగా, సమాజ సేవలో నిరంతరం ఉండే అబ్దుల్లాకు తండ్రి లేని లోటు తీర్చలేనిదన్నారు. ఈ సందర్భంగా అవాద్ బిన్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పందెం కొండల్ యాదవ్, ముస్లిం మత పెద్దలు, కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!