ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఆరు గ్యారెంటీ ల హామీలపై అసెంబ్లీ ముట్టడించిన బీజేపీ నాయకులు అరెస్ట్ - పోలీస్ స్టేషన్...

ఆరు గ్యారెంటీ ల హామీలపై అసెంబ్లీ ముట్టడించిన బీజేపీ నాయకులు అరెస్ట్ – పోలీస్ స్టేషన్ తరలింపు

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ఆరు గ్యారెంటీ ల హామీలపై, కాలయాపన చేస్తూన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ పాలనను నిలదీయడానికి అసెంబ్లీ ముట్టడించిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ ఆధ్వర్యంలో బడంగ్ పేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ 58 వ డివిజన్ బీజేపీ నాయకులు జనరల్ సెక్రెటరీ ధ్యాసాన్ని తిరుపతిరెడ్డి, ఇంద్రావత్ రవి నాయక్, మొక్క నరేందర్ కుమార్, రామావత్ శ్రీను నాయక్, మురళి చారి, శ్రీకాంత్, సాయి, జిల్లా నాయకులతో కలిసి చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేశారు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కి రెండున్నర సంవత్సరాలు గడిచిన కాలయాపన చేస్తూన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ పాలనను నిలదీయడానికి ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!