ePaper
Saturday, June 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డిఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరం - మాజీ మంత్రి ఎమ్మెల్యే...

ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరం – మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య

నిరుపేదలకు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ జల్ పల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన రమాదేవి భర్త బాబు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ. 60 వేలకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే రుమాల్ బాబు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. పేదలు ఆపద కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి, నాయకులు కొంగరి సుభాష్, ఉస్కెమూరి నిరంజన్, గుండు నర్సింగ్, మాజీ సైనికుడు, సోషల్ మీడియా వారియర్ కాట్రగడ్డ వాసు బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!