ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డిజీవన్ దాన్ కు అవయవాల దానం

జీవన్ దాన్ కు అవయవాల దానం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

అవయవదానం మరొకరికి పునర్జన్మ ప్రసాదిస్తుందని
వార్తలు తరచుగా, టీవీలలో, వార్తా పత్రికలో వస్తుంటాయి. ఇలాంటిదే బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్ పేట్ లో ఓ మహిళ బ్రెయిన్ స్టోక్ బారినపడి బ్రెయిన్ డెడ్ అయింది. అయితే ఆమె అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు జీవన్ దాన్ కు అందజేశారు. దీంతో ఆ గ్రామంలో నీ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ తమ అవయవాలను దానం చేసి.. మరణాంతరం నేత్రదానం వల్ల అంధులైన వారికి చూపు ప్రసాదించవచ్చునని, అవయవ దానం వల్ల ఎంతో మందికి పునర్జన్మను ఇచ్చినట్లు అవుతుందని పలువురు తెలిపారు.

బడంగ్ పేటలో..

బడంగ్ పేట్ గ్రామ మాజీ సర్పంచ్ సూర్ణగంటి అర్జున్ మాతృమూర్తి సూర్ణగంటి నరసమ్మ (72) (కనకమ్మ) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించడంతో, కుటుంబ సభ్యులు ఎంతో గొప్ప మనసుతో ఆమె అవయవాలను (లివర్, కిడ్నీలు) జీవన్ దాన్ కు దానం చేశారు. ఈ మహోన్నత నిర్ణయంపై ఆసుపత్రి యాజమాన్యం నరసమ్మ కుమారులు, కుటుంబ సభ్యులకు అశ్రునయనాలతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి అవయవదానం మరెంతో మందికి ప్రాణదానం అవుతుందనీ.. నరసమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుర్ణగంటి జగన్, సుర్ణగంటి గణేష్, సుర్ణగంటి లక్ష్మి , సుర్ణగంటి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!