ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఎండలో నిలబెట్టి పింఛన్లు ఇస్తున్నారని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ జోన్ బడంగ్ పేట్ సర్కిల్ జిల్లెలగూడ డివిజన్ లో ఎండలో నిలబెట్టి పింఛన్లు ఇచ్చి అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన సౌకర్యాలు (నీడ, మంచినీరు) కల్పించకుండా వృద్ధులను ఎండలో నిలబెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. యువత లాంటి వాళ్ళు ఎండలో నిలబడి ఉండి సొమ్మ సిల్లుతారు.. అలాంటిది. వయోవృద్ధులు, వికలాంగుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. కనీసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎండలో నిలబెట్టకుండా టెంట్ వేసి, మంచినీళ్లు కల్పించి పింఛన్లు ఇస్తే అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం చూడవచ్చు. ఎండలో నిలబెట్టి పింఛన్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. ఈ సమస్యపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వృద్ధులు వికలాంగులు కోరుతున్నారు.
ఎండలో ఉండాలంటే ఇబ్బందులు పడుతున్నాం

మల్లమ్మ, దాసరి నారాయణ రావు కాలనీ జిల్లెలగూడ డివిజన్
ప్రతిసారి పింఛన్ తీసుకున్న సమయంలో వానకాలంలో వర్షానికి తడిసి, ఎండాకాలంలో ఎండకు నిలబడి ఇబ్బందులు పడుతున్నాము. కింద పడిపోతున్నాం. వృద్ధాప్యం సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలేదు. ఎండలో గంటల తరబడి నిలబడుతున్నాం. అధికారులు దయవుంచి పింఛన్ ఇచ్చే సమయంలో టెంటు ఏర్పాటు చేయాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలి.
