ePaper
Sunday, May 31, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణక్షయ రహిత జిల్లాగా కృషి చేయడం అభినందనీయం

క్షయ రహిత జిల్లాగా కృషి చేయడం అభినందనీయం

📰 Generate e-Paper Clip

మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

యాదాద్రి భువనగిరి జిల్లాను క్షయ (టీ.బీ) రహిత జిల్లాగా మార్చడానికి వైద్య, ఆరోగ్యశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం (టీ.బీ) సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ వ్యాధి నివారణ శాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జగదేవ్ పూర్ చౌరస్తా వరకు కొనసాగింది. ప్లకార్డులు ప్రదర్శించి టీ.బీ పై ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం 100 రోజులు టీ.బీ ముక్త భారత్ అభియాన్ లో భాగంగా “టీ.బీ ఎలిమినేషన్” మిషన్ ను వైస్ చైర్మన్ పోతం శెట్టి మంజుల వెంకటేశం, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.మనోహర్ కలిసి ప్రారంభించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వంశీకృష్ణ, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ యశోధ, డా. సుమన్ కళ్యాణ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు పీ. రాజేశ్వర్ రావు, మాజీ అధ్యక్షులు కే. నర్సింగ్ రావుల చేతుల మీదుగా న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులైన డాక్టర్లు రామకృష్ణ, యశోద, వీణా, సుమన్ కళ్యాణ్, వంశీకృష్ణ, వైద్య అధికారులు డా. నిరోషా, డా. నితీషా, స్కిడ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది, రోటరీ క్లబ్ మాజీ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు మంచి కంటి వెంకటేశం, మాజీ కౌన్సిలర్ బాలయ్య, కౌన్సిలర్లు, సభ్యులు ఎం.డి. చాంద్, క్షయ నివారణ ఐసీటీసీ, వైద్యశాఖ సిబ్బంది, మెడికల్ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!