ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్గ్యాస్ కొరతతో జనం కష్టాలు

గ్యాస్ కొరతతో జనం కష్టాలు

📰 Generate e-Paper Clip

జనం పై గ్యాస్ బండ గుదిబండగా మారింది.

వంటగ్యాస్ డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

అమెరికా, ఇజ్రాయిల్ -ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల వంటగ్యాస్ కొరత సామాన్య వినియోగదారులు, ఇతర రాష్ట్రాల నుండి బతుకు తెరువుకు హైదరాబాద్ వచ్చి పనిచేస్తున్న వారిపై గ్యాస్ సిలిండర్ గుది బండగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ ప్రభావం చిరు వ్యాపారుల, ఇతర రాష్ట్రాల నెత్తిన పిడుగులా పడింది. మహేశ్వరం, తుక్కుగూడ, శ్రీరామ కాలనీ ఇండస్ట్రీ ఏరియా ప్రాంతాలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా పనిచేస్తుంటారు. వారు అవసరమైన సమయంలో కాకుండా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తుంటారు. ప్రజలకు డిమాండ్ తగట్టు డీలర్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో డీలర్లు సకాలంలో వినియోగదారులకు సిలిండర్లను పంపణీ చేయలేకపోతున్నారు. గ్యాస్ బుక్ చేసుకునేందుకు వినియోగదారులు ఆన్ లైన్ లో పలుమార్లు ప్రయత్నాలు చేస్తున్నా బుక్ కావడం లేదంటూ డీలర్ల ముందు తమ గోడును వినిపిస్తున్నారు. అదే విధంగా ఆన్ లైన్ లో సిలిండర్ కోసం బుక్ చేసుకున్నా.. తొందరగా వస్తుందన్న గ్యారంటీ లేక పోవడంతో వందలాది మంది వినియోగదారులు ప్రతిరోజు గ్యాస్ డీలర్ల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గతంలో డీలర్ల వద్దకు పోకుండానే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న ఒకటి, రెండు రోజులకే సిలిండర్లను పొందుతున్న వినియోగదారులు.. యుద్ధ ప్రభావంతో బుకింగ్ చేసుకున్న తమకు సకాలంలో సిలిండర్లు అందుతాయా? లేదా? అన్న సందేహంతో డీలర్ల వద్దకు వచ్చి తమ బాధను వెలిబుచ్చుతున్నారు. కొంత మంది అయితే ఏకంగా గ్యాస్ ఏజెన్సీ వాళ్లపైన గొడవకు దిగుతున్నారు. ఘర్షణ పడుతున్నారు. వాణిజ్య సిలిండర్లు లేకపోవడంతో చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా సర్కిల్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, టీ కొట్టులు, తోపుడు బండ్ల పైన నిర్వహించే మిర్చి సెంటర్లు మూతపడడం కనిపించాయి. గ్యాస్ ధరలు పెంచడంతో టిఫిన్ సెంటర్ లలో రేట్లు పెంచడం కనిపించింది. దీంతో వ్యాపారాలు లేక తాము నష్టపోతున్నామని వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. అసలే తీవ్ర ఇబ్బందులతో సతమవుతం అవుతున్న తమకు గ్యాస్ కొరత గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ బండ బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. సరిపడా సిలిండర్లను ప్రభుత్వం సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నెత్తిపైన గ్యాస్ బండ పిడుగు పడింది

ముఖ్యంగా ఇతర రాష్ట్రాలైన బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాదు నగరానికి, నగర పరిసర ప్రాంతాలలో వచ్చి వివిధ కంపెనీలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి అరణ్య రోధగా మారింది. వీరికి గ్యాస్ కనెక్షన్ లేకపోవడంతో బ్లాక్ లో కొనుక్కునేవారు. ఇప్పుడు బ్లాక్ లో కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. గతంలో బ్లాకులో రూపాయలు రూ. 1100 ఉండే గ్యాస్ ప్రస్తుతం రూ. 2000 నుంచి రూ.2500 మధ్యల విక్రయిస్తున్నారు. అయినా కూడా బ్లాక్ లో గ్యాస్ ఇయ్యక పోవడంతో ఇతర రాష్ట్రాల కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది కట్టె పుల్లలు ఏరుకొచ్చి వంట చేసుకుంటున్నారు. కట్టెలు గూడ దొరక లేని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. తిరిగి వారి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కంపెనీలు కూడా మూసేసి పరిస్థితికి వచ్చింది.

కట్టెల పొయ్యి తో అన్నం, కూర వండడం, చపాతీలు చేసుకోవడం ఇబ్బంది పడుతున్నాం

రామ్నాథ్ రామ్, శ్రీరామ కాలనీ

మేము బీహార్ రాష్ట్రం నుంచి బతుకు తెరువు కోసం వచ్చి సింఘానియా చాక్లెట్ కంపెనీలో పని చేస్తున్నాము. వంటలు వండుకుంటాము. గ్యాస్ అయిపోయి వారం అవుతుంది. ఇప్పుడు గ్యాస్ కిలోకి 250 రూపాయలు తీసుకుంటున్నారు. మాకు వచ్చే జీతం అంతా గ్యాస్ కొనడానికి సరిపోతుంది. గ్యాస్ దొరకడం లేదు. కట్టెల పొయ్యి పై అన్నం, కూర, చపాతీలు చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

గ్యాస్ బుకింగ్ కోసం లైన్ లో గంటలు తరబడి నిలబడవలసి వస్తుంది

తులసి బాయ్ , శ్రీరామ కాలనీ

ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మా పాలిట శాపం అయింది. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నాము . ఆన్ లైన్ లో గ్యాస్ బుకింగ్ చేస్తే బుకింగ్ కావడం లేదు. ఏజెన్సీ దుకాణానికి వెళ్లి లైన్ లో నిలబడి గంటల తరబడి ఉన్నా కూడా బుకింగ్ కావడం లేదు. ప్రభుత్వము ప్రజలందరికీ గ్యాస్ ఇబ్బందులు లేకుండా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!