పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
నూతనంగా డీసీసీ కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం – నియామక పత్రాలు అందజేత
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు ప్రజలలోకి తీసుకెళ్ళి బలోపేతం చేయాలని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం స్థానిక వివేరా హోటల్ లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ జిల్లా అధ్యక్షులు బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ బడ్జెట్ సమావేశంలో ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు, రేషన్ మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన్నపుడే మీ పదవులకు న్యాయం జరుగుతుందన్నారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు పదవి వస్తుందని అన్నారు. అందుకు తానే ఉదాహరణ అని యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న తనని ఎంపీ చేశారని చెప్పారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రైతుల కోసం కాల్వలను పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం రాకముందే స్థాపించిన పార్టీ అని ఇందులో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి గ్రామంలో పట్టణంలో ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాలన్నారు. ఇటీవల నూతనంగా నియామకమైన కాంగ్రెస్ డీసీసీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అందజేశారు. ముందుగా ప్రభుత్వ విప్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, యాదగిరిగుట్ట చైర్మన్, ఆలేరు చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్రమోద్ కుమార్, గ్రంధాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, మార్కెట్ చైర్మన్ రేఖా బాబురావు, భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్, జిల్లా చైర్మన్ సామర్ల రవీందర్, జనరల్ సెక్రెటరీ వాజిద్, ప్రకాష్, రవీందర్ రెడ్డి, రాజశేఖర్ శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లా మార్కెట్ చైర్మన్ లు, కౌన్సిలర్స్, సర్పంచులు, మాజీ జెడ్పిటీసీలు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
