ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ వివక్షత చూపిన రేవంత రెడ్డి ప్రభుత్వం
ఇప్పటికైనా 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ వివక్షత చూపిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ విమర్శించారు. ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తి కోసం, నిర్వాసితుల నష్టపరిహారం కోసం తక్షణం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సీపీఎం ఇంటింటి సమస్యల అధ్యయనంలో భాగంగా గ్రామంలోని గ్రామ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, ఉప సర్పంచ్ అందే మల్లేశం, మాజీ సర్పంచ్ మాకొల్ల సత్యంకు కరపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహా మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లాలో అత్యంత కీలకమైన బస్వాపురం ప్రాజెక్టు సుమారుగా 10 మండలాల్లోని లక్ష ఎనబై వేల (1.80) ఎకరాలకు పైగా సాగు భూమికి నీరు అందించేందుకు ఉపయోగపడే బస్వాపురం ప్రాజెక్టు కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తయితుందని తెలిపారు. కానీ కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టుకు విడుదల చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులో ఉన్న ఆ కొన్ని నీళ్లు ఈ ప్రాంతపు రైతాంగానికి చాలా ఉపయోగపడతాయని తెలిపారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు ఆనాడు వైయస్సార్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని తెలుపుతున్నారు, కానీ గత ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టు మీరెందుకు మిగతా పది శాతం నిధులు కేటాయించి పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. పూలు జల్లడం, కొబ్బరికాయలు కొట్టడం కాకుండా అసెంబ్లీలో బస్వాపురం ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తి నిధులు వచ్చే విధంగా ఆందోళన చేపట్టాలని జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలను నర్సింహా కోరారు. ఇప్పటికైనా ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోతున్న రైతులు, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాటలను నమ్మకుండా ప్రాజెక్టు పూర్తి సాయి నిర్మాణం కోసం, నిర్వాసితులకు రావలసిన నష్టపరిహారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ పాల్గొన్నారు.
