ePaper
Sunday, April 5, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ - రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కే.ఎల్.ఆర్

ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ – రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కే.ఎల్.ఆర్

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో చేసే ప్రార్థనలు, ధానధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జల్ పల్లి, పహాడీషరీఫ్, షాహిన్ నగర్ దర్గాలు, ఈద్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.35 లక్షల నిధులు కేటాయించటం సంతోషమన్నారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు ఇబ్బందులు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారని కె. ఎల్. ఆర్ కొనియాడారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇచ్చిందని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. అన్ని రంగాల ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ 2026-27 ను రూపొందించారని కిచ్చెన్నగారు కొనియాడారు. తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీ సహా మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం  కృషి చేస్తోందని లక్ష్మారెడ్డి చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!