ePaper
Tuesday, April 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణబీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

బీసీల జనాభా యాభై శాతం

బడ్జెట్ మూడున్నర శాతమా…?

సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు ఆగ్రహం

ప్రతిఘటన, తెలంగాణ బ్యూరో ప్రతినిధి

బీసీల ఓట్లు వేసుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల పూర్తిగా వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు చామకూర రాజు విమర్శించారు. శుక్రవారం తెలంగాణ ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు జరిగిన అన్యాయంపై సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు కేవలం 12,511 కోట్ల రూపాయల కేటాయించడం బీసీలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఈ ప్రకటనలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయల కేటాయిస్తామని, సబ్ ప్లాన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని తుంగలో తొక్కిందని ఆయన మండిపడ్డారు. గత రెండు బడ్జెట్లలో ఎంబీసీ కార్పొరేషన్ కు బీసీ ఫెడరేషన్లకు కూడా ఖర్చు పెట్టిందేమీ లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో బీసీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల పూర్తిగా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు డబ్బులు విడుదల చేయకపోవడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీకి కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వము బీసీ యువత స్వయం ఉపాధి గురించి, బీసీ విద్యార్థులకు పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. బీసీ వర్గాల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆర్థికంగా అణగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ను గద్దె దింపుతాం – కే.వీ గౌడ్

రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెదిగే వరకు పోరాటం చేస్తామని సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కే. వీ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు నాటి నుంచి నేటి వరకు అన్ని రకాలుగా బీసీలను మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. జాతీయ స్థాయిలో సైతం బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రంలో రాజకీయ రంగంలో బీసీలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అణిచివేసిందని ఆయన ఆరోపించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!