ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణమజ్లీస్ పార్టీ బైకాట్ చేయడం హేయమైన చర్య

మజ్లీస్ పార్టీ బైకాట్ చేయడం హేయమైన చర్య

📰 Generate e-Paper Clip

మజ్లీస్ పార్టీ బైకాట్ చేయడం హేయమైన చర్య

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

అసెంబ్లీలో వందేమాతర గీతం ఆలాపన జరుగుతున్న సమయంలో మజ్లీస్ పార్టీ బైకాట్ చేయడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బడంగపేట్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభలో జాతీయ గీతం వందేమాతరం గానం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు బైకాట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పు పడుతుందని మతోన్మాద శాసనసభ్యులను శాశ్వతంగా, బహిష్కరించాలని మజ్లీస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం గుర్తింపును ఎలక్షన్ కమిషన్ రద్దు చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని శంకర్ రెడ్డి అన్నారు. మజ్లీస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పై బీజేపీ పార్టీ ఆందోళనకు పిలుపు ఇవ్వవలసి వస్తుందని హెచ్చరించారు, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం, మన జాతీయ గీతాన్ని వందే మాతర గీతాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, అలా కాకుండా మజ్లీస్ పార్టీ వారు ఇటీవల అసెంబ్లీలో వందే మాతర గీతం ఆలాపన జరుగుతున్న సమయంలో బై కాట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ చర్య దేశం పట్ల వారికి ఉన్న గౌరవం పై ప్రశ్నలను లేవనెత్తుతుందని. అసలు వీరి విధేయత ఎవరి పట్ల ఉంది అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సాక్షిగా వారి నాయకులు జై పాలస్తీనా అని నాదాలు చేసిన తీరును దేశ ప్రజలు ఎలా మరిచి పోతారని వ్యాఖ్యానించారు. కాగా మజ్లీస్ ఎమ్మెల్యేల వైఖరి సిగ్గుచేటు అని ఈ చర్య భారతమాత ఆత్మ కు జాతీయ గేయానికి జరిగిన అవమానమని శంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సమావేశంలో నాయకులు దేశపాక జగన్, రాకేష్, కృష్ణ, మహేశ్వర్ రెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, ఎస్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ‎

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!