ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణపీఎం సంసద్ క్రీడా మహోత్సవ సభను విజయవంతం చేయాలి

పీఎం సంసద్ క్రీడా మహోత్సవ సభను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

సభా స్థలిని పరిశీలించిన నాయకులు

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభను విజయవంతం చేయాలని భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 22 న సాయంత్రం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే సభాస్థలిని బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి బీ.ఎల్. వర్మ, ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటారని క్రీడాకారులు, యువతి యువకులు, మేధావులు, విద్యావేత్తలు, రెడ్ క్రాస్, రోటరీ క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్, యువజన సంఘాల ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, విద్యార్థిని విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గ కో – ఆర్గనైజర్ పట్నం కపిల్, భువనగిరి పట్టణ ఆర్గనైజర్ కట్టమోజు ఉష కిరణ్, బీజేపీ నాయకులు నార్ల నర్సింగ్ రావు, చందా మహేందర్, మాయ దశరథ, వైజయంతి, కౌన్సిలర్ బండారు స్వర్ణలత, రత్నపురం శ్రీశైలం, ఏనుగు సతీష్ రెడ్డి, ఎండీ మహమ్మద్, తాడూరి కుమార్, నరేష్, భువనగిరి సిద్ధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!