ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి

మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యం. డి జహంగీర్

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

నైజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎదురునిలిచి పోరాడిన నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారిమని మల్లు స్వరాజ్యమని, నేటి తరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యం.డి జహంగీర్ తెలిపారు. గురువారం భువనగిరిలోని సుందరయ్య భవన్ లో మల్లు స్వరాజ్యం 4వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. గతంలో నైజం రజాకార్లు, దోరలు పరిపాలించిన విధంగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయని అన్నారు. బీజేపీ పేద ప్రజల సంక్షేమం మరచి దేశ వ్యాప్తంగా మతోన్మాద బావ జాలాన్ని పెంచి పోషిస్తు ప్రజల మధ్యన విభజన తెస్తుందని విమర్శించారు. అమెరికా చేస్తున్న యుద్ధం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా ఉందని దీనిపై దేశ ప్రధాని కనీసం స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, సీపీఎం జిల్లా కమిటి సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు మహేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ సీపీఎం భువనగిరి మండల కార్యదర్శివర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి, చిన్నయ్య, ప్రభాకర్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!