ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
బాలాపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్, బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్నగంటి రంజిత్ కుమార్, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ హైదరాబాద్ నగర కార్యదర్శి కొల్లూర్ భీమేష్ తదితరులు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిథాని డిపో నుంచి నాదర్ గూల్ వైపు వెళ్లే వాహనాలు, మంద మల్లమ్మ నుంచి ఆర్.సి.ఐ శంషాబాద్ వెళ్లే వాహనాలు రాకపోకల సమయంలో బాలాపూర్ చౌరస్తా వద్ద ప్రతినిత్యం చాలా దూరం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే బస్ స్టాఫ్ లేక విద్యార్థులు , సాదారణ ప్రజలు రోడ్ల మీద నిలబడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా బస్ షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని కోరారు. రోజు రోజుకు పెరుగుతున్నా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కనుగుణంగా ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మించాల్సిన ఆవశ్యకత అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన ఇబ్రాం శేఖర్ సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటానని తెలిపారన్నారు.
