ePaper
Saturday, June 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్యువకుడు అదృశ్యం పదోవ రోజు బావిలో శవమై..!

యువకుడు అదృశ్యం పదోవ రోజు బావిలో శవమై..!

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్

అదృశ్యమైన యువకుడు బావిలో శవమై తేలిన ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాల్వగడ్డ ప్రాంతానికి చెందిన సుభాష్ కుమారుడు గౌతం (20) పెయింటర్. ఈ నెల 4న ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువకుడు తిరిగి రాకపోవడంతో ఈనెల 8 న కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా రాజన్నబావి, భవాని బిల్డింగ్, సమీపంలోని పుల్లమ్మ బావిలో దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల (ట్యాంక్ బండ్ శివ) సహాయంతో మృతదేహాన్ని వెలికితీయగా, మృతదేహం గౌతందిగా తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!