ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్చించోలే *చించి* పడేస్తాం..!

చించోలే *చించి* పడేస్తాం..!

📰 Generate e-Paper Clip

గణపతి చించోలే ఇంటిపైగుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి పై కత్తులతో దాడి

ఇంటి గేటు ధ్వంసం

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

జీహెచ్ఎంసీ  జల్ పల్లి డివిజన్ శ్రీరామ కాలనీలో నివాసం ఉంటున్న రాష్ట్ర బీజేపీ నాయకుడు గణపతి చించోలె ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సందర్భంగా బుధవారం గణపతి చించొలే శ్రీరామకాలనీలో ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ..  ఇటీవల  జరిగిన చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజున కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి ముందు ఉన్న కటౌట్లు, జెండాలను కావాలనే తొలగించారని తెలిపారు. జెండాలు తొలగించే దృశ్యాలు వీడియో కెమెరాలో రికార్డు అయ్యిందని, ఆ వీడియో డిలీట్ చేయాలని తనకు ఫోన్ ద్వారా పలుసార్లు బెదిరించారని పేర్కొన్నారు. అది కుదరకపోగా  దీంతో పాటు జల్ పల్లి డివిజన్ బీజేపీ పార్టీ తరపున కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఎక్కడ విజయం సాధిస్తాడోనని కుట్రలు పన్ని మంగళవారం రాత్రి తన ఇంటిపై దాడి చేసి హత్య చేయాలని, ఇంటి ముందు ఉన్న గేటును పూర్తిగా ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై పోలీసులకు 100 కు డయల్ చేసి సమాచారం ఇచ్చానని కేవలం 10 నిమిషాలలో పహాడీషరీఫ్ పోలీసులు సమయానికి రావడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. తనపై కావాలనే కొంత మంది దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, రాజకీయంగా తనను ఎదగనివ్వకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దాడులకు భయపడే వ్యక్తిని కాదని, తనపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాజకీయంగా ఏవైనా ఉంటే ఎదుర్కోవాలని ఇలా కుటుంబంతో ఉన్న తన ఇంటిపై దాడి చేయడం ఇది రాజకీయ సంస్కారమా అని ఆయన ప్రశ్నించారు.  సకాలంలో పోలీసులు రాకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో అని ఆవేదన చెందారు. సకాలంలో స్పందించిన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర బీజేపీ పెద్దలకు సమాచారం ఇవ్వడం జరిగిందని, గురువారం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!