ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ఇఫ్తార్ విందులు కేవలం భోజనం మాత్రమే కాకుండా, హిందూ – ముస్లిం సోదరుల మధ్య ప్రేమ, అభిమానాలు పెంపొందిస్తాయని మినీ సిటి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. బాలాపూర్, మినీ సిటీ కాలనీలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు అందరూ విచ్చేసి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి, సోదరభావానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ విందుల్లో పాల్గొనడం, మతాల మధ్య ఐక్యతను పెంపొందించడం ద్వారా ఇఫ్తార్ విందులు ప్రత్యేకమైన సాంస్కృతిక వేదికలుగా మారుతున్నాయని తెలిపారు.
