చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
ప్రజలకు మెరుగైన సేవలకై అందరు సమన్వయంతో పనిచేయాలని భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం పురపాలక సంఘం పరిధి లోని వార్డు నెం. 22, 28, 34 లలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేశారు. వార్డులో చాలా రోజులుగా పేరుకుపోయిన చెత్త, చెట్లను తొలగించి, మురికి కాలువలను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు జాలిగం విగ్నేశ్, సుధాగాని సరిత రాజు, తుమ్మేటి పాండు పాల్త్య వెంకటేష్, బొంతల నర్సింగ్ రావు, బింగి నరేష్ బర్రె పూజిత జహంగీర్, బెండె స్వరూప లాల్ రాజు, సరగడ రాజ్యలక్ష్మి అమర్, మున్సిపల్ అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.
