ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఘనంగా శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు

ఘనంగా శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం నియోజకవర్గం పరిధి రామకృష్ణ పురం డివిజన్ లో శ్రీ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగడం చాలా సంతోషకరమన్నారు. 52 ఏళ్లుగా ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని తెలిపారు. ఆ ఆంజనేయ స్వామి దయవల్ల మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. రామభక్తుడైన హనుమంతుడు మనందరికీ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఉత్సవాలను క్రమశిక్షణతో, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ తలాటి రమేష్ కి, ఈఓ, ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. రాజకీయ పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దైవ సేవ, ప్రజా సేవ నిరంతరం కొనసాగాలి. హనుమంతుడి సేవలో తన పూర్వజన్మ సుకృతం. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ తలాటి రమేష్ నేత, ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్, ఈఓ ఉమారాణి, రాష్ట్ర బీసీ నాయకులు గట్ల రవీంద్ర, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్,బొడ్డుపల్లి మహేందర్, యాదవ రెడ్డి,అల్లేటి కిరణ్, రామకృష్ణ గౌడ్, భూపాల్ రెడ్డి, జగన్నాథం, రామారావు* ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, కమిటీ సభ్యులు విజయలక్ష్మి,శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర్లు,సాయి, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!