ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా అమీర్ పేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మన్సన్ పల్లి వెంకటేష్ గౌడ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మహేశ్వరం మండలం పరిధిలోని అమీర్ పేట్ పద్మావతి ఫంక్షన్ హాల్లో మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ యాదయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండమోని అంజయ్య ముదిరాజ్, వర్కల యాదగిరి గౌడ్, ఆవుల యాదయ్య, కేజే ప్రసాద్, తొంట ఈశ్వరయ్య, గళ్ళ యాదయ్య , ఆవుల రఘుపతి, తాళ్ల రమేష్ గౌడ్, సమ్మ మల్లేష్, కడల భాస్కర్, వర్కల రమేష్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎర్ర చంద్రమోహన్, హైతబాద్ రాజేందర్, గళ్ళ అనిల్, వంశీ గౌడ్, నీరటి మల్లేష్, బసవ యాదయ్య, తాళ్ల అంజయ్య, వర్కల సత్తయ్య, లింగాల బాలరాజు, బొమ్మ శ్రీనివాస్ గౌడ్ , బీర్ల ప్రశాంత్, సిహెచ్ అనిల్, కార్తీక్ గౌడ్, భరత్, తొంట సంతోష్, కంది వినయ్, వార్డ్ మెంబర్లు డబ్బు జనార్దన్, మహమ్మద్ షఫీ, మంచినీళ్ల శ్రీనివాస్ తదితర నాయకులు కలిసి వెంకటేష్ గౌడ్ ను అమీర్ పేట్ గ్రామ అధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కేఎల్ఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందే విధంగా కృషి చేస్తానన్నారు. సమాజంలోని పేద, బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. కేఎల్ఆర్ సహకారంతో అమీర్ పేట్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ సీనియర్ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
