ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

భువనగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఎర్రం లక్ష్మి విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానమని మహిళలు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించాలని, ప్రతి పనిలో పురుషులతో సమానంగా ముందుండాలని సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో మంచి విజయాలు అందుకుని ప్రయాణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ మహిళ లెక్చరర్లు, అతిధులు మహిళా సిబ్బంది అందరికీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు తోటకూరి రామకృష్ణ, కనక బాలరాజు, ఎండీ.అత్తరు ఫరీన్, కూరపాటి స్రవంతి వల్లస్ అలివేలు మహిళా లెక్చరర్లు ఎన్ సుధా, సుమలత, సరిత, సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!