ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఘనంగా ప్రమాణ స్వీకారం

ఘనంగా ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథిగా హాజరైన మల్ రెడ్డి రామ్ రెడ్డి

ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి

నాగోల్ అనంతుల జంగా రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛై ర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నాగోల్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, నాగోల్ సీఐ మక్బూల్ జానీ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి, కాలనీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, మాజీ అధ్యక్షులు భాస్కర్, జనరల్ సెక్రటరీ డా.చందులతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి సంఘం సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గంలోని ప్రతి కాలనీనీ సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అమలుతో ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్న మా దృష్టికి వస్తే, పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మంజులా రెడ్డి, చంపాపేట్ డివిజన్ అధ్యక్షులు దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేష్ నాయక్ గారు, ఆలయ ధర్మకర్తలు తోకటి కిరణ్, శ్రీనివాస్, నాయకులు సోలిపురం వెంకట్రామ్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్, బంజారా జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కే.గాంధీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!