ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయ్ కాంత్
మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మార్చి 1ను పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. 30 సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్పీఎస్ పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మార్చి 1న మాదిగ అమరవీరుల దినోత్సవం ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. వర్గీకరణ పోరాటంలో తమ అసమాన త్యాగాలను తృణప్రాయంగా అర్పించి జాతి ఉద్యమానికి అమరులు తీవ్రమైన కృషి చేశారన్నారు. అందులో భాగంగానే ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి సమాజంల్లో అసమానతలు తొలగించడంతో పాటు భారత రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని, హక్కులు ఈ దేశంలోని ప్రతి ఇంటికి చేర్చే విధంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నూతన పోరాటాలకు శ్రీకారం చుడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోళ్ల శివ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, గూట విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, దేవరపాగ ప్రభాకర్ మాదిగ ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు, కరిగేళ్ల దశరథం మాదిగ ఎం ఎస్ పీ జిల్లా అధ్యక్షులు, గుడిగానిపల్లి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, కాళ్ళ ప్రసాద్ మాదిగ ఎం ఈ ఎఫ్ డివిజన్ అధ్యక్షులు, భాస్కర్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు, ఎం ఈ ఎఫ్ లక్ష్మణ్ మాదిగ, ఎం ఈ ఎఫ్ నాగ లక్ష్మణ్ మాదిగ, మహేంద్ర నాధ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
