అని అనుకుంటున్నారు హయత్ నగర్ ప్రజలు..!
సూర్యుడి కన్న.. ముందుండే మీరు ఎక్కడ సారు..?
ఎమ్మెల్యే గారు..
మీరు పదవిలో ఉన్నారా.. లేరా..?
మీకు ప్రజలు పదవి ఇచ్చింది సమస్యల పరిష్కారానికా.. లేక ఓపెనింగ్ లాగా..?
మీ నాయకులే.. సమస్యలను వెలుగులోకి తెస్తున్నారు
మీరు మాజీ ఎమ్మెల్యే అయితే ప్రజలు నమ్మేవారు
కానీ మిమ్మల్ని హయత్ నగర్ ప్రజలు కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు
అధికారులు మీ మాట వినడం లేదా.. మరి ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు.. రాజీనామా చేయండి
అని అభిప్రాయపడుతున్నారు స్థానిక ప్రజలు..!
అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటించారు కదా..!
మరి ఇప్పుడు అదే అభివృద్ధి కోసం మళ్లీ కాంగ్రెస్ లో చేరుతారా..?
స్థానికంగా జరుగుతున్న చర్చ
ఆలోచించండి, సమస్యలు పరిష్కరించకుండా.. ఒక వేళ ఇతరులను మీద చూపిస్తే.. మూడు వేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి

ప్రతిఘటన, హైదరాబాద్ ప్రతినిధి
తమ చేతకానితనాన్ని ఇతరుల మీద నెట్టి రాజకీయ నేతలు పబ్బం గడుపుకుంటారు అనేందుకు ఇదే నిదర్శనం. ఇందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సరిగ్గా సరిపోతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అదెక్కడో కాదు ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే. ఎందుకంటే ఎల్బీనగర్ ప్రజలు నమ్మకంతో స్థానిక ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ ఇప్పుడు అదే స్థానిక ప్రజలకు శాపంగా మారింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సమస్యలు పరిష్కరించడం చేతకాక ఇతరులపై నెపం వేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి మరి.. సమస్యలు పరిష్కరిస్తారా..? లేక ఇతరులపై తోసేస్తారా..? వెయిట్ అండ్ సీ..!

గుర్రపు డెక్క కూడా తొలగించలేక పోతే ఎమ్మెల్యే పదవి ఎందుకు..?
ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అందులో ప్రధానంగా హయత్ నగర్ లో ఉన్న రెండు చెరువులు మురికి కూపాలుగా మారాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యంతో చెరువుల్లోకి డ్రైనేజీ నీరు వచ్చి చేరుతుంది. అనాలోచిత నిర్ణయాలతో అధికారులు డ్రైనేజీ నీళ్లను చెరువుల్లో కలిపారు. ఫలితంగా చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. దీనికి తోడు గుర్రపు డెక్క చెరువును మొత్తం ఆవరించింది. చుట్టూ చెత్త చెదారం పేరుకుపోయింది. ఫలితంగా దోమలు విద్యను మించి చుట్టుపక్క కాలనీలో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన స్థానిక ఎమ్మెల్యే తప్పించుకుని తిరుగుతున్నాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సమస్యను మాజీ తాజా కార్పొరేటర్ సమస్యను పరిష్కరించలేదు అనే నెపం వేస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకుడు వీడియోలు చేసి ప్రజల్లోకి వదులుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. హయత్ నగర్ కు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కాదని ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకు ఆయన పరిష్కరించడం లేదని వాపోతున్నారు.
అభివృద్ధి కోసం మళ్లీ పార్టీ మారుతారా..?
గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్లీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతారా.. స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అధికారులు ఎవరూ.. ఆయనకు సహకరించకపోవడంతోనే సమస్యలు పరిష్కరించలేకపోతున్నారా.. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓపెనింగ్లకే పరిమితం..!
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు సూర్యుడు కంటే ముందుండే సుధీర్ అన్న అంటూ.. ఉదయం మార్నింగ్ చేసి సమస్యలు తెలుసుకునే ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉదయాన్నే మార్నింగ్ వాక్ పేరుతో సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని అన్వేషించే వారిని గుసగుసలాడుకుంటున్నారు. వాటన్నింటిని అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా తన బినామీల పేరుతో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అందుకే సమస్యలపై దృష్టిసారించకుండా మార్నింగ్ వాక్ కు స్వస్తి పలికారేమో అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ఓపెనింగ్ లకే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిమితమయ్యారని చర్చించుకుంటున్నారు.
