ప్రతిఘటన మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
శ్రీ ఆదిలక్ష్మి అలుమేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి క్షేత్రం 3700 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కలియుగ దైవంగా భక్తుల కష్టాలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి. సాక్షాత్తు విష్ణువు అవతారమైన ఈయన, పాపాలను తొలగించే దేవుడు. వెంకన్నను దర్శించుకుంటే జన్మాంతర పాపాలు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మంఖాల్ 67వ డివిజన్ శ్రీనగర్ (ఈ-సిటీ రోడ్) లో కొలువుదీరిన , బ్రహ్మాండ కోటి దేవ దేవుని శ్రీ ఆదిలక్ష్మి అలివేమేలు మంగా సమేత శ్రీ బాలాజీ వెంక టేశ్వరస్వామి (స్వయంభూ) ఆలయం వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలు నాలుగురోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. సహజ సిద్ధమైన ఆలయం స్వయం భూ వెలిసిన ఆలయాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. పూర్తిగా కొండల మధ్యన ఉంటుంది. ఆలయ పరిసరాల్లో కోనేరు ఉంటుంది. ఎంత కరువు వచ్చినా అందులో నీరు ఎండిపోదు. కోనేటి నీరు తియ్యగా ఉంటాయి. స్వామివారికి నిర్వహించే తిరుకల్యాణంలో ఈ నీటితోనే అభిషేకాలు చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 6.30కి ఎదురుకోలు . 7.30కి ఆదిలక్ష్మి అలివేలు మంగ, వేంకటేశ్వర స్వామి దంపతుల కల్యాణం నిర్వహిస్తారు. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. వేసవికాలం కావడంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పా ట్లను పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు. ఆలయ మాఢ వీధులు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. భక్తులు స్వామివారినీ దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
అంగరంగ వైభవంగా
భక్తుల జన సందోహల మధ్య శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత స్వయం భు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. భక్తులు మొదటగా ముఖద్వారం ముందు వీరాంజనేయ స్వామిని సేవించుకుని ఆలయంలోకి ప్రవేశించాలి, అనంతరం బాలాంజనేయ స్వామిని దర్శించుకోవాలి. బాలాంజనేయ స్వామిని దర్శించుకుంటే సంతానం కాని దంపతులకు బాలస్వామికి ఆకు పూజ, అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ప్రధాన ఆలయం ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని చిన్న కేశవ స్వామిని దర్శించుకుంటారు. అహంకారం, కోపం, ధర్మం, ఈర్ష ద్వేషాలు వదిలిపెట్టి తూర్పు దిక్కున ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు తెలిపారు.
ఆలయ కోనేరు చరిత్ర
500 సంవత్సరాల క్రితం
ప్రతాపరుద్రుడి కాలంలో వైశ్యుడు వెంకన్న పుట్టుకతోనే అంధకారంలో ఉన్నాడు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశాడు. శ్రేయోభిలాషులు, బ్రాహ్మణులు తిరుపతికి వెళ్లి ధార్మిక కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుందని సలహా ఇచ్చారు. దీంతో ఆ వైశ్యుడు 15 ఏండ్లు బండ్లలో కుటుంబ సభ్యులతో, గ్రామంలోని వాసులతో దేవరకొండ నుంచి మాల్ మీదుగా ఇబ్రహీంపట్నం, రావిరాలకు బయలు దేరారు. మధ్యాహ్నం కావడంతో అక్కడ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. బాలుని రూపంలో ఆ దేవదేవుడు వచ్చి అంత దూరం ఎలా ప్రయాణిస్తావని సమయంలోనే మంఖాల్ గ్రామం శ్రీనగర్ ఈ సిటీలో గృహాంతాలలో వెంకటేశ్వర స్వామి కొలువు తీరారని అక్కడ ఆలయానికి ఈశాన్య దిశలో కోనేరును తవ్వించాలని కోరడంతో కోనేరు తవ్వించాడు. అనంతరం ఆయన పుట్టుకతో వచ్చిన అంధకారం తొలిగిపోయిందని ప్రతీతి. ఆ రోజు నుంచి ఆ కోనేరుకు మంచి కంటి వెంకన్న కోనేరుగా నామధేయం వచ్చింది
6 తరాలుగా ఆ దేవదేవుడు సేవలో శేషం కుటుంబ సభ్యులు
ఆరు తరాల నుంచి శేషం కుటుంబ సభ్యులు బ్రహ్మోత్సవాలు శేషం శ్రీధరా చార్యులు, శ్రీనివాస చార్యులు, రామా చార్యులు , మధుసూదనా చార్యులు, జగన్నాథ చార్యులు, శేష శ్రీనివాస్ సింహాచార్యులు నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలు ఇలా
శ్రీనగర్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం
నేడు 28వ తేదీ ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, తిరువారాధన, అర్చన సేవకాలం, సాయంత్రం 6 గంటల 30 నిము షాలకు ఎదుర్కోలు (గజవాహన సేవ) రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం. మార్చి 01 ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, తిరువారాధన అర్చన సేవకాలం, సాయంత్రం 7 గంటలకు ఉత్సవ మూర్తుల రథోత్సవం. మార్చి 02న ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమా ర్చన, శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం. సాయంత్రం 6 గంటలకు తిరిగి స్వామివారి స్వామి వారి విగ్రహహాలను గ్రామానికి ఊరేగింపు తీసుకెళ్తారు
ఏర్పాట్లు పూర్తి
స్వయంభూ వెలిసిన ఆలయాల్లో శ్రీనగర్ శ్రీవేంక టేశ్వరస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రతి ఏడాది ఫల్గుణ మాసంలో నాలుగు రోజుల పాటు తిరుకల్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తాము.
నాలుగు రోజులపాటు తిరు కళ్యాణ మహోత్సవాలు
ప్రతి ఏడాది ఫల్గుణ మాసంలో ఏకాదశి నుంచి చతుర్దశి వరకు నాలుగు రోజుల పాటు తిరు కల్యాణ మహోత్స వాలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉత్సవాలు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. తిరుకల్యాణ ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం, రథోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి.


ఆలయ అనువంశిక ధర్మకర్తలు శ్రీనివాస సింహచార్యులు, జగన్నాథ చార్యులు
