ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్సరస్వతీ శిశు మందిర్ నూతన భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

సరస్వతీ శిశు మందిర్ నూతన భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

📰 Generate e-Paper Clip

సరస్వతీ శిశు మందిర్ నూతన భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

చిన్నారుల భవిష్యత్తు పునాదులు బాల్య దశలోనే పడతాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని బడంగ్‌ పేటలో నిర్మించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యానికేతన్ నూతన భవనాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్తు పునాదులు బాల్య దశలోనే పడతాయని పేర్కొన్నారు. ఇలాంటి శిశు మందిరాల ద్వారా విద్యతో పాటు ఆధ్యాత్మిక విలువలు కూడా పెంపొందుతాయని, దాంతో పిల్లల ప్రవర్తనలో క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యత వంటి లక్షణాలు అలవడతాయని తెలిపారు. విద్యా రంగంలో ఇలాంటి సంస్థలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ సర్కిల్‌కు సంబంధించిన స్థానిక నాయకులు, నిర్వాహకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!