డెంగ్యూ మలేరియా వ్యాధులతో జర భద్రం
ప్రతిఘటన ,మహేశ్వరం ముత్తయ్య రిపోర్టర్
డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో జర జాగ్రత్తగా ఉండాలని జల్ పల్లి మాజీ కౌన్సిలర్ కేంచె లక్ష్మీనారాయణ అన్నారు. జీహెచ్ఎంసీ జల్ పల్లి సర్కిల్ రిలయన్స్ కాలనీలో చిన్నారి సారిక డెంగ్యూ బారిన పడింది. విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఆ బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందితో కాలనీలో శానిటేషన్ చేయించి, దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారులు దోమల నియంత్రణకు రెండు రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయాలన్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో నిద్రించేటప్పుడు ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. దోమతెరలను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బుడమాల కుమార్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
