ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్గుండెపోటుతో దోమల మల్లేష్ మృతి

గుండెపోటుతో దోమల మల్లేష్ మృతి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

హైదరాబాదు నగరంలోని కాచిగూడ ఎస్సి హాస్టల్ పూర్వ విద్యార్థి దోమల మల్లేష్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన స్వగ్రామం పల్లెపహాడ్, మండలం, నార్కెట్ పల్లి, నల్గొండకు జిల్లాకు చెందిన దళిత కుటుంబం నుంచి వచ్చిన దోమల మల్లేష్ ఎన్నో అవమానాలను ఓర్చుకొన్నాడు. మాదిగ విద్యార్థి సమాఖ్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, సాంఘిక సంక్షేమ హాస్టల్లో దండోరా ఉద్యమ పునాది వేశారు. అందర్నీ కదిలించేది కలుపుకు పోయేది.. అన్ని తానై పెద్ద మనిషిగా నడిపించాడు. ప్రేమ అంటేనే జీర్ణించుకోలేని సమాజంలో ఆదర్శ ప్రేమ వివాహాం (కులాంతర) రెడ్డి మహిళను వివాహం చేసుకున్నాడు. కుల వ్యవస్థ కు ఎదురొడ్డి తన పిల్లలను ఉన్నత స్థానంలో పై చదువులకోసం అమెరికాకు పంపి వారిని అభివృద్ధి పథంలో నిలిచే క్రమంలో తన ప్రాణాలను విడిచి శాశ్వతంగా తిరిగి రాని లోకానికి వెళ్లాడు. బడుగు జీవుల పెద్దన్న దోమల మల్లేష్ కు కాచిగూడ సాంఘిక సంక్షేమ హాస్టల్ పూర్వవిద్యార్థులు మాదిగ జాతి తరపున విద్యార్థి నాయకుల తరఫున దండోరా ఉద్యమాల కన్నీటి నివాళి అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!