ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అడుగుజాడల్లో నడవాలి

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అడుగుజాడల్లో నడవాలి

📰 Generate e-Paper Clip

బంజారాలు బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అడుగుజాడల్లో నడిచి బంజారాలు బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిహెచ్ఎంసి మీర్ పేట్ 60 డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి హిల్స్ జిల్లెలగూడ సేవాలాల్ భవన్ దగ్గర ఎర్పాటు చేసిన సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జన్మదిన మహోత్సవాలలో ముఖ్య అథితులుగా రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజరాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడులను జిహెచ్ఎంసి మీర్ పేట్ 60వ డివిజన్ లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని .సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది వేసి అచరించి చూపారని తెలిపారు. బంజారాలు అనాడు రాజుల కాలం నుండి బ్రిటీష్‌కాలం వరకు అయా రాజ్యాలకు అవసరమైన యుద్ద సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండే వారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ బోదనల వల్ల బంజారా జాతిపురోగమించడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అడుగుజాడల్లో నడిచి ప్రతీ ఒక్కరు బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. బంజారాలకు రిజర్వేషన్‌ కల్పించి, ఉన్నత స్థితికి రావడానికి సేవాలాల్‌ మహారాజ్‌ ఎంతగానో కృషిచేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, దోమలపల్లి రాజ్ కుమార్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు అబ్బనమొని గోపి యాదవ్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనిత హతిరాం నాయక్, మాజీ ఎంపీటీసీ కాట్రావత్ కోట్యా నాయక్, మాజీ టెంపుల్ డైరెక్టర్ సుర్వి లత శేఖర్ గౌడ్, నాయకులు సాయి యాదవ్ సేవాలాల్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫోఫేసర్ “డా” శంకర్ కుమార్ నాయక్, పూర్యా నాయక్ , బన్సీలాల్ నాయక్, వెంకటేష్ నాయక్, జగన్ నాయక్, రత్తు నాయక్, రాములు నాయక్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!