ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి ప్రతినిధి జంగిటి రవీందర్

ప్రజావాణిలో వచ్చిన హౌసింగ్ బోర్డ్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఈసోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 30 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 25, జిల్లా గ్రామీణ అభివృద్ధి 2, హౌసింగ్ 2,మున్సిపాలిటీ ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీ.ఈ.ఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!