ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరికార్మిక నేత బీ.టీ రణదివె ఆశయాలను కొనసాగిద్దాం

కార్మిక నేత బీ.టీ రణదివె ఆశయాలను కొనసాగిద్దాం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

భారత కార్మిక వర్గ పోరాట యోధుడు, సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీ.టీ రణదివె 36 వ వర్ధంతినీ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం పాల్గొని బీ.టీ.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీ.టీ రణదివె కేవలం ఒక నాయకుడే కాదు, కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతకర్త అని, దేశంలో కార్మిక హక్కుల కోసం, దోపిడీ లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదనీ, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, మాయ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య, ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ, వనం రాజు, చింతల శివ, బందెల ఎల్లయ్య , సుందర్ ,కవిత, దనమ్మ, శ్రీను పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!