ePaper
Saturday, May 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeనాగర్ కర్నూల్ఆదర్శ పాఠశాలలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి -జిల్లా విద్యాధికారి రమేష్...

ఆదర్శ పాఠశాలలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి -జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్

📰 Generate e-Paper Clip

ఆదర్శ పాఠశాలలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్ విడుదల.

జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

జిల్లాలో గల ఆదర్శ పాఠశాలల ప్రవేశ కొరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఈనెల 19న (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, 7వ తరగతి నుండి 10వ తరగతి ప్రవేశ పరీక్ష అదేేే రోజు 19 వ తేదీ (ఆదివారం) రోజున మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయము కంటే అరగంట ముందుగా పరీక్ష కేంద్రమునకు హాజరు కావలసిందిగా జిల్లా విద్య అధికారి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రు లు సమయపాలన పాటించి, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా సహకరించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!