ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మహేశ్వర నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ 56 వ పుట్టినరోజు సందర్భంగా నాయకులు కాకి ఈశ్వర్ కి శుభాకాంక్షలు తెలిపి సన్మానించడం జరిగింది . అనంతరం నాయకులు గజమాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
షేక్ హాజీ బాబా ఆధ్వర్యంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
మహేశ్వరం గ్రామం లో అతి పవిత్రమైన హజరత్ సయ్యద్ కమల్ షావలి రహమతుల్లా అలై దర్గాలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈశ్వర్ ముదిరాజ్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ దర్గాలో దువా (ప్రార్థన) చేశారు. ప్రజల పక్షాన ఆయన ఎప్పుడు ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షుడు బంగారిగల్ల లాజర్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్, సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షుడు శెట్టి అశోక్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పినమౌని శ్రీకాంత్ ముదిరాజ్ , మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, శివగంగ ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, ఉప్పుగడ్డ గ్రామ సర్పంచ్ రాజు నాయక్, కోళ్ల పడకల్ గ్రామ సర్పంచ్ చేపంగి ప్రవీణ్, మహేశ్వరం మండల సమన్వయ కమిటీ చైర్మన్ మల్లేష్ యాదవ్, ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి, కబడ్డీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్ది కర్ణాకర్ రెడ్డి, కార్మిక శాఖ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడు నడి కూడా శివ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గదగూటి జంగయ్య ముదిరాజ్, ఆవుల యాదయ్య, ప్రశాంత్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఇంద్రకంటి నరసింహ గౌడ్, మాజీ ఎంపిటిసిలు పాండు నాయక్, హరికిషన్ గౌడ్. మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్, మహేశ్వరం మండల యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నడికుడ రాకేష్ ముదిరాజ్, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
