తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహా
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలు రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సందర్భంగా మహాసభల జయప్రదం కోసం ఈ నెల 11న రామన్నపేటలోని సంఘం మండల కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆహ్వాన సంఘం సన్నాక సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు, ప్రజాతంత్ర వాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహా ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలు మే 18,19 తేదీల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా 3వ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనేక కూలీ, భూమి పోరాటాలకు కేంద్రంగా ఉన్నదని తెలిపారు. కవులకు , కళాకారులకు, జానపద కళారూపాలకు నిలయంగా ఉన్నదని తెలిపారు.1936లో ఏర్పడిన వ్యవసాయ కార్మిక సంఘం భూమిలేని పేదల కోసం, ప్రభుత్వ భూములు పంచాలని, అనేక ఉద్యమాలు నిర్వహించి పెద్ద ఎత్తున పేదలకు భూములను పంచిందని అన్నారు. కూలీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని అనేక ఉద్యమాలు నిర్వహించి కూలీ రేట్లు పెంచి కూలీల పక్షాన నిలబడిందన అన్నారు. జీతగాల్ల, పాలేర్ల పక్షాన కూడా నిరంతరం పోరాడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వలసలను నివారించాలని, అందరికీ పని కల్పించాలని దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలను, పోరాటాలను, ఉద్యమాలు నిర్వహించి 2005 లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. పోరాటల చరిత్ర కలిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా 3వ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశంలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహా కోరారు.
