ePaper
Tuesday, April 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డిబీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాసేవలో ముందుండాలి

బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాసేవలో ముందుండాలి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

భాజపా నాయకులు, కార్యకర్తలు ప్రజల సేవలో ముందుండాలని మీర్ పేట్ అధ్యక్షుడు ముఖేష్ , బీజేపీ సీనియర్ నాయకుడు మద్ది రాజశేఖర్ రెడ్డి, మేకల రవీందర్ రెడ్డి సూచించారు. సోమవారం భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు ముగించుకొని 47 వ వసంతంలో అడుగులు వేసిన సందర్భంగా మీర్ పేట్ – 2 లో మీర్ పేట్ అధ్యక్షుడు ముఖేష్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. పార్టీ స్థాపన, లక్ష్యాలు, సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాలను బీజేపీ బలోపేతం చేస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యకర్తలు ప్రజల సేవలో ముందుండాలని వారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!