ePaper
Tuesday, April 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డియువత ఉచిత శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి - షేక్ హాజీ బాబా

యువత ఉచిత శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి – షేక్ హాజీ బాబా

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

సీసీ కెమెరాల శిక్షణ పూర్తి చేసుకుని సొంతంగా సీసీ కెమెరా మెకానిక్‌గా ఉపాధి పొందవచ్చనీ, లేదా ఉద్యోగాలు సాధించవచ్చనీ, మహేశ్వరం మండల యువత ఉచిత శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షుడు షేక్ హాజీబాబా, నిర్వాహకులు సూచిస్తున్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల ఏప్రిల్ 26 నుండి ఉచిత శిక్షణ శిబిరాలు యూనియన్ రీసెటి ముచ్చింతల్ యూనియన్ బ్యాంక్ జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ స్వర్ణ భారత్ ట్రస్ట్ వారిచే సంయుక్తంగా కో- ఆర్డినేటర్ శివ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు సీసీ కెమెరాల, సెక్యూరిటీ అలారం, స్మోక్ డిటెక్టివ్ పై ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఉచిత హాస్టల్ వసతి, ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు అని తెలిపారు. యూనిఫారం, టూల్ కిడ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందనీ.. శిక్షణ అర్హతలు వయోపరిమితి 19 – 45 సంవత్సరాలు, శిక్షణ 13 రోజులు ఉంటుందన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు,10 వ తరగతి సర్టిఫికెట్ జీరాక్స్, 4 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని రావాలన్నారు. 13 రోజుల శిక్షణ పూర్తి అయిన తర్వాత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారని తెలిపారు. ఉచిత శిక్షణ శిబిరాన్ని మహేశ్వరం మండల యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజులలో సీసీ కెమెరా నిపుణులకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కనుక యువత ముందుకు వచ్చి ఇలాంటి ఉచిత శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7382123670 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!