ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeరంగారెడ్డిశ్రీ సీతారామ కళ్యాణంలో పాల్గొన్న యేల్మేటీ అమరేందర్ రెడ్డి

శ్రీ సీతారామ కళ్యాణంలో పాల్గొన్న యేల్మేటీ అమరేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

శ్రీరామనవమి సందర్భంగా బాలాపూర్ లోని హనుమాన్, వేణుగోపాలస్వామి, దేవతాల గుట్ట ఆంజనేయ స్వామి ఆలయాలలో వైభవంగా జరిగిన శ్రీ సీతా రామ కళ్యాణం లో కాంటెస్టెడ్ ఎమ్మెల్యే , పిసిసి కార్యదర్శి యేల్మేటీ అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి కుటుంబం పునాది అనే భావనను ప్రకటిస్తూ కష్టకాలంలో కూడా సతీ ధర్మాన్ని, కుటుంబ విలువలను శ్రీ సీతా రాములు ఎలా కాపాడారో రామాయణం చెబుతుందన్నారు. సీతమ్మ తల్లికి జీవితమంతా కష్టాలే అంటారు.. కానీ సుఖ దుఃఖాల్లోనూ ఆమె మనసు రామ వశమే. రామయ్య సీతమ్మ వశం. అందుకే వారిద్దరూ యుగాలు దాటినా ఆదర్శ దంపతులుగా పూజలు అందుకుంటున్నారు. వారి కల్యాణం లోకానికి కల్యాణకరం.. సమస్త జగత్తుకు శుభకరమన్నారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ వంగేటి మధుసూదన్ రెడ్డి, చలపతి రెడ్డి, సంరెడ్డి, నారాయణరెడ్డి బద్దం మల్లారెడ్డి, రామస్వామి ఆంజనేయులు, వేణుగోపాలస్వామి చైర్మన్ కృష్ణారెడ్డి, ఆంజనేయులు దేవతలగుట్ట హనుమాన్ చైర్మన్ సంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం నిరంజన్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!